TG: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఫిలింనగర్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కొడంగల్‌లోని కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.