అధికారులే జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించాారు. బుల్డోజర్లు ఇకపై గ్యారేజీకే పరిమితమవుతాయని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుల్డోజర్ న్యాయం పేరుతో ఉత్తరప్రదేశ్లో తొలుత ఈ ధోరణి మొదలైన విషయం తెలిసిందే.