TPT: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న గృహాల పురోగతిపై కమిషనర్ ఎన్.మౌర్య గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ అధికారులు ఆరు లేఔట్లలో నిర్మాణంలో ఉన్న గృహాల పురోగతిని కమిషనర్‌కు వివరించారు.