AP: గత వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని, రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్ వెల్లడించింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ 14 పైసలు, పన్నేతర 3 పైసలు, రుణాల రికవరీ ద్వారా పైసా ఆర్జించారని తెలిపింది. గత ప్రభుత్వంలో రూపాయిలో 15 పైసలు జీతాలకు వెచ్చించారని పేర్కొంది.