NDL: పాణ్యం మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరు సక్రమంగా లేదని, పనితీరు మెరుగుపరచుకోవాలని మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఫార్మసిస్టు పనితీరు సక్రమంగా లేకపోవడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖని కలెక్టర్ ఆదేశించారు.