కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. జార్ఖండ్‌లోని దేవగఢ్ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు ఎత్తేయడానికి రాహుల్ కుట్ర చేశారని విమర్శించారు. అందుకే కులగణన తెరపైకి తెచ్చారని అన్నారు. రాజీవ్ గాంధీ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ యాడ్స్ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.