AP: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని మాజీ CM జగన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 4నెలలు మాత్రమే ఉందని.. ఇప్పుడు బడ్జెట్ పెట్టడం సరికాదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ బడ్జెట్ అని ఆరోపించారు. వాళ్ల మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే ఇంతకాలం బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. ఆర్గనైజ్డ్ క్రిమినల్లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.