AP: మాజీమంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో విడదల రజిని ఆదేశాల మేరకు సీఐ నారాయణ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి తమను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి పని చేస్తే చంపుతామని కూడా బెదిరించారని వెంటనే విడదల రజిని, ఆమె పీఏ, సీఐ నారాయణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.