AP: వైసీపీకి మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఈ క్రాప్ ఎంతమందికి చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. ఈ క్రాప్ జరగకపోవడంతో ఇన్సూరెన్స్ కట్టలేదని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క రబీ సీజన్‌కి ఈ క్రాప్ చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో పేరుకే ఉచిత బీమా అని.. కానీ ఎవరికీ అందలేదని తెలిపారు. ఉచిత పంటల బీమాకు సంబంధించి 14 వందల కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.