AP: ఉన్నత విద్యామండలిలో రసాభాస జరుగుతోంది. ఇటీవల ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా.. అదనపు బాధ్యతను జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి అప్పగించారు. గతంలో అప్పటి కార్యదర్శి నాగవేణికి ఆర్ధిక ఖాతాలు అప్పగించకపోవడంతో ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ క్రమంలో నాగవేణి ఉన్నత విద్యామండలి ఆఫీస్కు వెళ్లి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిని బెదిరింపులకు గురిచేసింది. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్ పేషీకి కృష్ణమూర్తి సమాచారం ఇచ్చారు.