E.G: రాజానగరం మండలం కొత్త వెలుగుబంధ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.