ELR : రైతులకు, కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏలూరు భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు. ఏపీ సీడ్స్ వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.