TG: రెండు గ్రామాల ప్రజలు రాకపోకల కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలోని కల్లూరు-పాత బూరుగుపల్లి మధ్య సుద్ద వాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రజలు అవతలి నుంచి ఇవతలి వరకు ఉన్న ఓ నీటి పైపు పై నుంచే రాక పోకలు కొనసాగిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా కొట్టుకుపోవడం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వంతెన నిర్మించాలని అధికారులను వేడుకుంటున్నారు.