AP: వైసీపీ నేతలకు మంత్రి కందుల దుర్గేశ్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్, హామీల అమలుపై మండలిలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ‘వైసీపీ చేసిన అప్పులు, బకాయిలు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని బాగుచేస్తున్నాం. పెన్షన్లు భారీగా పెంచాం, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం. మీరు ఐదేళ్లు చేయలేని పనులు మేము 5 నెల్లలోనే చేశాం’ అని పేర్కొన్నారు. అయితే గడిచిన ఐదేళ్లు విధ్వంస పాలన అనడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం చేశారు.