AP: HRC, లోకాయుక్త కమిషన్ను అమరావతిలోనే ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతిలోనే ఉంచేందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది. కాగా, హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై మద్దిపాటి శైలజ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.