TG: హైదరాబాద్లోని బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. 1962 లెక్కల ప్రకారం బతుకమ్మ కుటం విస్తీర్ణం 16.13 ఎకరాలు అయితే ప్రస్తుతం 5.15 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. దాని పునరుద్ధరణపై స్థానికులతో రంగనాథ్ చర్చించారు. ఇళ్లు, నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లబోదని స్థానికులకు భరోసా ఇచ్చారు. కాగా.. హైడ్రా కమిషనర్ రాకతో బతుకమ్మకుంట పరిసరాల్లో పోలీసులు మోహరించారు.