VSP: గోకులం షెడ్లకు గ్రామ సభలో 30 మంది దరఖాస్తులు చేసుకోగా కేవలం ముగ్గురిని మాత్రమే ఎలా ఎంపీక చేశారని పాములవాక మాజీ సర్పంచ్, వైసీపీ కోటవురట్ల మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు ప్రశ్నించారు. పాములవాకలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో మాజీసర్పంచ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను సర్పంచ్ ప్రమేయంలేకుండా మంజూరు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.