AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్న పిటిషన్లపై విచారించిన కోర్టు.. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. కానీ పిల్ వేయడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.