TG: కొడంగల్ రైతులు జైలుకు వెళ్తే.. స్థానిక MLA రేవంత్ ఎక్కడున్నారని మాజీమంత్రి KTR ప్రశ్నించారు.’టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? కొడంగల్లో ఫార్మా కంపెనీపై ఆరునెలలుగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించకుండా సీఎం మహారాష్ట్రంలో ఏం చేస్తున్నారు. రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారు. కొడంగల్లో జరిగింది కుట్ర కాదు. సీఎం వైఖరి వల్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి’ అని అన్నారు.