SRD: పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీ నగర్, రామచంద్రపురం పటాన్ చెరువు డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ప్రతి కాలనీలో నిరంతరం చెత్త సేకరణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.