SKLM: భామిని మండలంలోని నాయీబ్రాహ్మణల సమస్యలపై బుధవారం మండల నాయీబ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి పొన్నాడ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల హామీలలో నాయీబ్రాహ్మణల బార్బర్ షాప్‌లకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మండలంలోని బార్బార్ షాప్‌లకు ఎటువంటి ఉచిత విద్యుత్ అందించలేదని కుమారస్వామి పేర్కొన్నారు.