బుల్డోజర్ న్యాయం పేరుతో చేపడుతున్న నేరస్తుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల ఇళ్లను అధికారులు.. బుల్డోజర్లతో కూల్చటం చట్ట విరుద్ధమని పేర్కొంది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. దోషిగా నిర్థారించినా చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని వెల్లడించింది. నిందితుల ఇళ్లు కూల్చివేస్తే.. వారి జీవించే హక్కుకు భంగం కలిగించినట్లేనని స్పష్టం చేసింది.