GNTR: పొన్నూరు మండలం మునిపల్లె గ్రామంలోని రేషన్ డీలర్ శ్రావణి కార్డుదారులకు సక్రమంగా రేషన్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తహసీల్దార్ ఎండిఎం వాహనం వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. 41 క్వింటాళ్ల రేషన్ బియ్యం వ్యత్యాసం రావడంతో డీలర్ శ్రావణిపై 6ఏ కేసు నమోదు చేశారు.