ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో బుధవారం 108 మంది కన్నె స్వాములు, సప్త నదీ జలాలతో అయ్యప్పకు అభిషేకం నిర్వహించారు. గంగానమ్మ ఆలయం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి, వావర్ స్వామిని దర్శించుకుని, గుర్వాయిగూడెం అయ్యప్ప ఆలయం వరకు పాదయాత్రగా అభిషేకం చేయడానికి నదీ జలాలను తీసుకువెళ్ళారు. సాయంత్రం మెట్ల పూజ ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.