TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో కోర్టు నేడు మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనుంది. ఇప్పటికే కేటీఆర్ తరఫున దాసోజు శ్రవణ్ వాంగ్మూలం నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఈరోజు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలు తీసుకోనుంది. అనంతరం కొండా సురేఖకు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కల్పించనుంది.