TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్‌ను మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో నేటి అవసరాలకు తగ్గట్లు మార్చాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు దక్కేలా ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోంది. కాగా, చివరిసారిగా 2019లో పాఠ్యప్రణాళికను మార్చారు.