ATP: పెద్దవడుగూరు మండలం అప్పెచర్ల గ్రామ సమీపంలోని 67 హైవేపై బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు. తల్లి భవాని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.