తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్…భారీగా రుణం తీసుకుని చెల్లించడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. 2014 నుంచి 2022 వరకు 33,787.26 కోట్ల రూపాయల రుణం చెల్లించాలని బ్యాంకులు వెల్లడించాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో ఈ కార్పొరేషన్ అప్పులు తీసుకుని చెల్లించడం లేదని తెలిపాయి.
ప్రతి ఏటా కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాయి. మరోవైపు పీడీఎస్ బియ్యం, హాస్టళ్ల అవసరాలకు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యం తీసుకుంటుంది. దీంతోపాటు కరోనా కాలంలో ఉచిత బియ్యం పంపిణీ సహా పలు కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం బియ్యం తీసుకుని డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆ నిధులతోపాటు FCI ఫండ్స్ కూడా సరియైన సమాయానికి రాకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి.