డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘పుష్ప 2’. ప్రపంచవ్యాప్తంగా ఇది డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను నటి శ్రీలీల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట కోసం ఆమె రూ.2 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా, గతంలో ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌కు సమంత రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకున్నారట.