ప్రకాశం: తండ్రిలేని యువతిని ఒంగోలుకు చెందిన మేనమామ గర్భిణీని చేసిన ఘటన భట్టిప్రోలులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో కోడలిని లొంగదీసుకొని గర్భిణీని చేశాడు.