ప్రకాశం: అద్దంకి మండలం, మణికేశ్వరం గ్రామంలో మంగళవారం ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్. హరికృష్ణ పర్యటించారు. సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై దోమ కాటు వలన కలిగే వ్యాధులు, దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. కలుషిత నీరు త్రాగకూడదని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.