పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వాయు కాలుష్యం గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయికి చేరుకుంది. గత నెలలో కాలుష్యం కారణంగా సుమారు 18 లక్షల మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రావిన్స్ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.