TG: సిద్దిపేట జిల్లా కేంద్రానికి శివారులోని బూరుగుపల్లిలో ఓ చిరుత, దాని పిల్లల సంచారం కలకలం రేపింది. చిరుత కూనల కదలికలను గుర్తించిన గ్రామస్తులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి పద్మ, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటనే బోను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.