AP: విశాఖ KGHలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. చనిపోయిందన్న శిశువులో కదలికలు వచ్చాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. శిశువులో కదలికలు లేకపోవడంతో డాక్టర్లు రాత్రంతా శ్రమించినా ఫలితం లేదని.. మృతి చెందినట్లు రికార్డ్స్‌లో ఎంటర్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగా శిశువులో కదలికలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి.. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.