వంధే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకి ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి గుజరాత్ లోని గాంధీ నగర్ కు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తూ ఉంటుంది. కాగా… గురువారం మధ్యాహ్నం ఈ రైలు ప్రమాదానికి గురైంది.
బాట్వా-మానీనగర్ స్టేషన్ల మధ్య ఉదయం 11. 15 గంటల ప్రాంతంలో కొన్ని గేదెలు ట్రెయిన్ కి అడ్డంగా వచ్చాయి. మరి కాసేపట్లో అహ్మదాబాద్ చేరుకుంటుందనగా, ఈ ట్రైన్ పట్టాలపై వెళ్తున్న గేదెల గుంపును ఢీ కొట్టింది. దాంతో, ట్రైన్ ముందు భాగం కొద్దిగా ధ్వంసమైంది. వెంటనే రైలు సిబ్బంది ధ్వంసమైన ఆ భాగాన్ని తొలగించారు.
ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం స్వల్పంగా దెబ్బ తిన్నదని, రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు చేశారు. అనంతరం రైలు సకాలంలో ముంబై సెంట్రల్ కు బయల్దేరింది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ను రూపొందించారు. గత నెలలో ప్రధాని మోదీ ఈ ట్రైన్ ను ప్రారంభించి, కాసేపు ఈ రైలులో ప్రయాణించారు.