మద్యం కుంభకోణంలో (liquor Scam) ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియాను (Manish Sisodia) అరెస్ట్ చేశారు. ఆయన పలు ఫోన్లను మార్చడం మొదలు... ఫైల్స్ డిలీట్ చేసే వరకు ఎన్నో వెలుగు చూశాయి. దీంతో సీబీఐ (CBI) అతనిని అరెస్ట్ చేసింది. ఆయన్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.
మద్యం కుంభకోణంలో (liquor Scam) ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియాను (Manish Sisodia) అరెస్ట్ చేశారు. ఆయన పలు ఫోన్లను మార్చడం మొదలు… ఫైల్స్ డిలీట్ చేసే వరకు ఎన్నో వెలుగు చూశాయి. దీంతో సీబీఐ (CBI) అతనిని అరెస్ట్ చేసింది. ఆయన్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారంపై సీబీఐ దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసింది. రాత్రి మొత్తం ఆయన సీబీఐ హెడ్ ఆఫీస్ లోనే ఉన్నారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోర్టులో హాజరుపరుస్తారు. సిసోడియా విచారణకు సహకరించక పోవడం వల్లే అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. కీలకమైన అంశాల మీద ఆయన సమాధానం ఇవ్వడం లేదని వెల్లడించింది. తప్పించుకునే సమాధానాలు, విరుద్ధమైన సాక్ష్యాలతో దర్యాఫ్తుకు ఏమాత్రం సహకరించలేదని తెలిపింది. ఈ కేసులో సిసోడియా నుండి సమాచారం రాబట్టవలసి ఉందని, కాబట్టి ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని… సీబీఐ కోరనుంది. ఛార్జీషీటులో సిసోడియా పేరు ఉన్నదని సీబీఐ తెలిపింది. అయితే పూర్తి సాక్ష్యాధారాలు సమీకరించిన తర్వాతనే అతని పేరును ఛార్జీషీటులో పొందుపరిచి, అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సిసోడియా ఇతరుల పేర్ల మీద వివిధ ఫోన్ నెంబర్ లు తీసుకున్నారు. కొన్నింటిని ధ్వంసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన 18 ఫోన్లు, నాలుగు ఫోన్ నెంబర్లు వినియోగించారు. ఒక్కరోజులోనే మూడు ఫోన్లు మార్చినట్లు సీబీఐ చెబుతోంది.
మద్యం లిక్కర్ కేసు(Liquior Case)లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ(CBI) అధికారులు ఆదివారం అరెస్ట్ చేసి కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు పలు విధాలుగా విచారించారు. అంతకుముందు సిసోడియా(Manish sisodia) మీడియాతో మాట్లాడుతూ..తనను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. అందుకే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్లించారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 19వ తేది మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ అధికారులు హాజరు కావాలని కోరారు. అయితే తాను ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నందున వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నానని, తనకు సమయం కావాలని సీబీఐ(CBI)ను మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ అధికారులు కూడా అంగీకరించారు. 26వ తేదీన రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివారం (26వ తేదీ) మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను 8 గంటల పాటు విచారించిన సీబీఐ, ఆ తర్వాత విచారణకు సహకరించడం లేదని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. అయితే ఆ లిస్ట్ లో తొలుత మనీశ్ సిసోడియా పేరు లేకపోవడం గమనార్హం. కానీ ఆ తర్వాత పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోాలున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేశారు.