జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఉత్తర జపాన్(Japan)లోని తీర ప్రాంత నగరాలైన కుషిరో, నెమురోలను భూకంపం వణికించింది. అయితే ఎలాంటి సునామీ(Tsunami) హెచ్చరికలను కూడా జారీ చేయలేదని జపాన్(Japan) అధికారులు వెల్లడించారు.
జపాన్(Japan)లో సంభవించిన భూకంపం ధాటికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నివేదికలు కూడా అందలేదు. జపాన్ లో రాత్రి 10.27 గంటలకు భూకంపం(Earthquake) సంభవించింది. ఉత్తర జపాన్ కు 43 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అయితే వారం రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ మధ్య జపాన్ లో భూకంపాలు(Earthquakes) సర్వసాధారణం అయిపోయాయి. ఆగ్నేయాసియాలోని పసిఫిక్ బేసిన్ అంతా భూకంప కార్యకలాపాల ఆర్క్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవనాలు బలమైన భూకంపాలను తట్టుకునేలా జపాన్(Japan) కఠిన నిర్మాణ నిబంధనలను తెచ్చింది. ఇకపోతే ఈమధ్యనే టర్కీ(Turkey), సిరియా(Suria) నగరాల్లో కూడా భూకంపాలు(Earthquakes) సంభవిచాయి. ఆ ఘటనలో ఇప్పటి వరకూ దాదాపు 50 వేల మంది కన్నుమూసినట్లు సమాచారం.