విజయనగరం జిల్లా స్థానిక సంస్థల MLCగా ఇందుకూరి రఘురాజు కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన 2027 నవంబర్ (మరో మూడేళ్లు) ఆ పదవిలో ఉండనున్నారు. 2021లో ఎన్నిక జరగగా.. స్థానిక సంస్థల్లో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఇందుకూరి వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.