ట్యాన్ కారణంగా చర్మం కాంతివంతంగా కనిపించదు. నిర్జీవంగా మారుతుంది. అయితే కాఫీ స్క్రబ్తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు స్పూన్ల కాఫీ పొడిలో ఒకటిన్నర స్పూన్ బ్రౌన్ షుగర్, టీ స్పూన్ ఆలివ్ నూనె, తేనె, పాలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే.. మృతకణాలు తొలగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.