»Tdp Leader Pattabi Has Moved To Rajahmandry Central Jail
pattabi:రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి.. ముసుగేసి కొట్టారు
pattabi:గన్నవరం ఇన్సిడెంట్‌కు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్ (pattabi) సహా 10 మందిని రాజమండ్రి (rajahmandry) సెంట్రల్ జైలుకు (central jail) తరలించారు. పట్టాభి అండ్ కోపై పోలీసులు 3 కేసులు (3 cases) పోలీసులు (police) ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
tdp leader pattabi has moved to rajahmandry central jail
pattabi:గన్నవరం ఇన్సిడెంట్‌కు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్ (pattabi) సహా 10 మందిని రాజమండ్రి (rajahmandry) సెంట్రల్ జైలుకు (central jail) తరలించారు. పట్టాభి అండ్ కోపై పోలీసులు 3 కేసులు (3 cases) పోలీసులు (police) ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. పట్టాభి సహా పది మందిని ఇదివరకే గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టులో (civil judge court) హాజరుపరిచారు. రిమాండ్ (remand) విధించడంతో జైలుకు తీసుకొచ్చారు. అంతకుముందు తోట్లవల్లూరు (total vallur) పోలీ స్టేషన్లో ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసి తనను కొట్టారని పట్టాభి చెప్పడంతో న్యాయమూర్తి శిరీష (sirisha) వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మిగతా పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు రిమాండ్ విధించారు.
పట్టాభిని (pattabi) పరీక్షించడానికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఐదుగురు వైద్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు పట్టాభికి పరీక్షలు జరిగాయి. అనంతరం గన్నవరం (gannavaram) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా అక్కడే ఉంచారు. బుధవారం ఉదయం పదిన్నరకు తిరిగి పట్టాభితోపాటు సబ్‌జైలులో ఉన్న పది మందిని కోర్టుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యులు చేసిన పరీక్షల నివేదికను జడ్జీకి అందజేశారు. పట్టాభి కోర్టుకు వెళ్తున్న సమయంలో వ్యాన్‌లో నుంచి తన అరచేతిపై ఉన్న గాయాలను మీడియాకు చూపించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలో మాత్రం పట్టాభి శరీరంపై తీవ్రమైన గాయాలు ఏమీ లేవని పేర్కొన్నారు.
వైద్యుల నివేదికను న్యాయమూర్తి (magistrate) పరిశీలించారు. దీంతోపాటు పట్టాభి (pattabi) ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించారు. రిమాండ్‌కు ఆదేశించారు. పట్టాభితోపాటు పది మందికి రిమాండ్ విధించినప్పుడు గన్నవరంలోని సబ్‌జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దానిపై జైలు అధికారులు బుధవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. 11 మందికి జైలులో బ్యారక్ కేటాయించడం సాధ్యం కాదన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి శిరీష అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రిమాండ్ విధించినప్పుడు ఎందుకు చెప్పలేదని ఆగ్రహించినట్టు సమాచారం. ఆ తర్వాత వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (vamsi) అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటాంచారు. ఆఫీసులో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (chandra babu), ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై (lokesh) వంశీ (vamsi) విమర్శించారు. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. తమ నేతను విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి దాడి చేశారు. టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. పార్టీ కార్యాలయం లక్ష్యంగా దాడి చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన పట్టాభిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దనే కారణం చూపి అదుపులోకి తీసుకున్నారు.