Prabhas Fans Warning : అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు…
Prabhas Fans Warning : స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఎలా కావాలంటే అలా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ స్టైల్.
స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఎలా కావాలంటే అలా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ స్టైల్. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. మొదట్లో మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు.. వద్దంటే వద్దని మారుతిని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. చాలా రోజుల పాటు మారుతి పై మండిపడ్డారు. కానీ రాను రాను సీన్ రివర్స్ అయిపోయింది. ముందుగా ఆ ప్రాజెక్ట్ వద్దన్న వారే.. ఇప్పుడు అప్టేడ్ కావాలంటూ రచ్చ చేస్తున్నారు. ఎలాగు ప్రభాస్ మాటిచ్చేశాడు కాబట్టి.. మారుతి సినిమా షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలు పెట్టేశాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయినట్టు టాక్. అయితే ఆ మధ్య ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. ప్రభాస్ లుక్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. దాంతో మారుతి ప్రాజెక్ట్ పై పాజిటివ్ వెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే.. ప్రభాస్, మారుతికి ఛాన్స్ ఇచ్చాడంటే మ్యాటర్ గట్టిగానే ఉందని నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లోకెల్లా.. మారుతి ప్రాజెక్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. అందుకే ఇప్పటికైనా అనౌన్స్ చేయాలని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ట్రెండ్‌తో పాటు ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ #AnnouncePrabhasMaruthiFilm హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో త్వరలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట మారుతి. రీసెంట్గా ప్రభాస్ పై ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా చేశారట. అయితే ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన మారుతిపై ట్రోల్స్‌ను తట్టుకోవడం కష్టమే. ఇప్పటికీ కొందరు మారుతికి వార్నింగ్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన వదిలిపెట్టమని అంటున్నారు. కాబట్టి మారుతి, పాన్ ఇండియా స్టార్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే.. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్.