మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో T20Iలో భారత్ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుపై టీమిండియా T20 సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గౌహతిలో జరిగిన ఈ మ్యాచులో ఇండియా తొలత ఆటకు దిగి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక చేధనకు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసి విఫలమయ్యారు. క్వింటన్ డి కాక్ (69 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్) మంచి స్కోరు చేశారు.
భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/62), అక్షర్ పటేల్ (1/53) వికెట్లు తీశారు. టిమిండియా బ్యాట్స్ మెన్ లలో కెఎల్ రాహుల్ (57), రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (61), విరాట్ కోహ్లి (49 నాటౌట్), దినేష్ కార్తీక్ ఏడు బంతుల్లో 17 నాటౌట్‌గా నిలిచి అద్భుత ప్రదర్శన చేశారు. ఇక చివరిదైన నామమాత్రపు మూడో టీ20 అక్టోబర్ 4న లక్నోలో రాత్రి 7 గంటలకు జరగనుంది.