టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ రికార్డుపై కన్నేశాడు. కివీస్‌తో శుక్రవారం ప్రారంభంకానున్న మూడో టెస్టులో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే, అశ్విన్ చెరో 37సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు.