NZB: జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సురేందర్ తెలిపారు. ఈ ఎంపికలు కల్లెడ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన జిల్లా జట్టును నవంబర్ 2 నుంచి 4వరకు ఆసిఫాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు.