అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో ముందుగానే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత రాష్ట్రం డెలావెర్లోని విల్మింగ్టన్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అనంతరం ఆయన.. ‘కమలాహ్యారిస్కు ఓటేసినందుకు గర్వంగా ఉంది’ అని ‘X’లో పోస్టు చేశారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలతోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్కు కూడా బైడెన్ ఓటేశారు.