టెక్ దిగ్గజం యాపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.