కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏళ్లు పైబడిన వారికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్ల వయసు దాటిన అందరికీ ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఉచిత వైద్యం అందనుంది. అలాగే, ఆయుష్మాన్ వయ వందన కార్డులను అందించనున్నట్లు మోదీ ప్రకటించారు.