David Warner : డేవిడ్ వార్నర్ కి గాయం…రెండో టెస్టుకి దూరం….!
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు దూరమయ్యారు. ఆయన గాయం బారిన పడ్డాడు. దీంతో... ఫిరోజ్ షా కోట్లాలో జరుగుతున్న రెండో టెస్టుకి వార్నర్ కి బదులుగా... అతడి స్థానంలో మేట్ రెన్ షాను బరిలో దింపారు. ఢిల్లీ టెస్టు తొలి రోజున బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతులను ఆడడంలో ఇబ్బంది పడ్డాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు దూరమయ్యారు. ఆయన గాయం బారిన పడ్డాడు. దీంతో… ఫిరోజ్ షా కోట్లాలో జరుగుతున్న రెండో టెస్టుకి వార్నర్ కి బదులుగా… అతడి స్థానంలో మేట్ రెన్ షాను బరిలో దింపారు. ఢిల్లీ టెస్టు తొలి రోజున బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతులను ఆడడంలో ఇబ్బంది పడ్డాడు.
ముందుగా ఓ బౌన్సర్ అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతని మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన వార్నర్.. ఫిజియోలతో ట్రీట్మెంట్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత మరో రెండు, మూడు బౌన్సర్లు అతని హెల్మెట్‌కు బలంగా తాకాయి.ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. గాయాలతో బ్యాటింగ్ కొనసాగించిన వార్నర్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అతను మైదానంలోకి రాలేదు. భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ కూడా చేయలేదు.
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తడబాటుకు లోనయ్యాడు. ఓ బంతి మోచేతికి బలంగా తగిలింది. మరో రెండు బంతులు హెల్మెట్ కు గట్టిగా తగిలాయి. ఆ సమయంలో ఫిజియోథెరపిస్టులు వచ్చి చికిత్స చేశారు. ఓ పక్క గాయాలు తగులుతున్నప్పటికీ వార్నర్ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరికి షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత జట్టు బ్యాటింగ్ చేసిన సమయంలో ఫీల్డింగ్ కూడా చేయలేదు. మైదానంలోకి దిగే పరిస్థితి కనిపించలేదు. దీంతో వార్నర్ స్థానంలో మరొకరిని ఆడించాలని ఆసీస్ జట్టు నిర్ణయించింది.