NDL: నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని పదోన్నతిపై తెనాలి జిల్లా కోర్టుకు వెళుతున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరాముడు తెలిపారు. ఈ మేరకు జడ్జిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి దివ్య, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.