KRNL: రుద్రవరంలో రెండు డయేరియా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుల ఇళ్ల వద్ద ఫ్లోరినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంతాలలో డయేరియా సర్వే చేశారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నిర్లక్షం చేయకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.